శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు
సా ధారణంగా వివాహం కాగానే అటు అబ్బాయిలుగానీ ఇటు అమ్మాయిలుగానీ ఓ ముఖ్యమైన పని పూర్తయిందని భావిస్తారు. తమ బాధ్యతలన్నీ ఇక భర్తే చూసుకోవాలని అమ్మాయిలూ.. లేదు తమ బాధ్యతలన్నీ ఇక భార్యవే అని అబ్బాయిలూ అనుకుంటారు. ఎవరికి వారు ఇరువురూ విశ్రాంతిగా ఉండాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఇది సాధ్యంకాదు.. పైగా సరైన ఆలోచన కూడా కాదు. గుర్తించాల్సిందేమంటే- తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా నిన్నటివరకూ గడిపిన నవదంపతులు పెళ్లయిన క్షణం నుంచీ మరిన్ని సరికొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సి ఉంటుంది. అందుకు భయపడాల్సింది కూడా ఏమీలేదు. ఒకరి కౌగిలిలో ఒకరు, ఒకరి గుండెల్లో ఒకరు ప్రేమగా ఎలా ఉండిపోవాలనుకుంటారో అంతే ప్రేమగా పరస్పరం ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించాలి. ఎందుకంటే మనకిష్టమైన వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇష్టపడేవే. తన నడకకీ, నడతకీ, వ్యవహారశైలికీ అన్నింటికీ జవాబుదారీ వహించాలి. వీటితోపాటు కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు బాధ్యత తీసుకోవాలి. కుటుంబ నిర్వహణ భారాన్నీ ఇరువురూ వహించాలి. సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాలు అని మనవాళ్లు అనేది ఇందుకే. అంతేనా? సంపాదించడంలోనూ సంసారాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఇద్దర...
Comments
Post a Comment