తగ్గుతోంది వడ్డీ..ప్రత్యామ్నాయం ఏదీ?
రోజురోజుకూ.. అటు బ్యాంకు పొదుపు ఖాతాలపైనా.. ఇటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై అందించే వడ్డీని 4శాతం నుంచి 3.5శాతం చేసింది. యాక్సిస్ బ్యాంకు కూడా ఇదే వడ్డీ రేటులోకి మారింది. కొంతకాలం ఆగితే మరిన్ని బ్యాంకులు ఇదే మార్గాన్ని అనుసరిస్తాయనడంలో సందేహం లేదు. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గత ఏడాది కాలంగా తగ్గుతూనే ఉన్నాయి. మరి, ఇలాంటప్పుడు ఏం చేయాలి? అధిక వడ్డీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలేమున్నాయి? వ డ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు డెట్ ఫండ్ల గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. నిజానికి వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ఇవి కొంత మంచి ఫలితాలనే అందిస్తుంటాయి. అయితే, వీటిని అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. వీటిలో ఉన్న రకరకాల పథకాల్లో.. ఏ అవసరానికి ఏది సరిపోతుందో ఎంచుకోవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. డెట్ ఫండ్లను ఎంచుకునేప్పుడు మన లక్ష్యం ఏమిటి? వ్యవధి ఎంత? వాటికి ఏ తరహా పథకాలు సరిపోతాయనేది తెలుసుకోవాలి. 1 రోజు నుంచి 90 రో...