శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు

చక్కటి సంబంధాన్ని కుదుర్చుకోవడంలో మీ మిత్రుల, బంధువుల సహకారం మీకు ఉన్నప్పటికీ, మీకున్న పరిచయాలను మించి అనేక కొత్త ప్రదేశాలలో కొత్త కుటుంబాలలోని సంబంధాల గురించి తెలుసుకొనే అవకాశాన్ని మీకందిస్తుంది. ''ఈనాడు పెళ్లిపందిరి'' మీరు ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారో తెలుపుతూ పెళ్లిపందిరిలో ప్రకటన ఇవ్వండి. మీ అభిరుచులకు అనువైన సంబంధాన్ని కుదుర్చుకోండి. మీ ప్రకటన ఆంధ్రరాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలోని తెలుగు కుటుంబాలకు చేరుతుంది. అధిక సంఖ్యలో సమాధానాలు అందుకొని మీకు వచ్చిన సంబంధం ఎంచుకునే అవకాశం మీదవుతుంది. ఈనాడు పెళ్లిపందిరిలో 4 లైన్ల ప్రకటనకయ్యే ఖర్చు రూ. 1950/- ప్రతి అదనపు లైనుకు రూ. 490/- చెల్లించాలి. పెళ్లిపందిరి ప్రకటనకు అయ్యే మొత్తానికి ఆదనంగా రూ. 60/- చెల్లిస్తే ఆ ప్రకటన ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో కూడా వస్తుంది. ప్రకటన ఖర్చు డిడి గా ప్రచురించవలసిన తేదీకి 3 రోజులు ముందు ఈనాడు కార్యాలయంలో అందాలి. అనువైన సంబంధాల ఎంపికలో మీ ఆత్మీయ బంధువు

నా హృదయం నీది యగుగాక 
నీ హృదయం నాది యగుగాక 
ఈ పెళ్లితో నువ్వూ నేనూ కలిసి 
పరిపూర్ణ మానవులం అయ్యెదముగాక! 
ఇదీ రుగ్వేదంలో చెప్పిన పెళ్లి ప్రమాణం.
పెళ్లి కాకముందు స్త్రీ అయినా పురుషుడైనా పూర్ణమానవులు కారు. పెళ్లి తర్వాతే వారికా పూర్ణత్వం సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేయడానికి అవసరమైన పరిపూర్ణత్వం లభిస్తుందనేది అందులోని ఓ కోణమైనా పెళ్లయ్యాక మనిషి పరిపూర్ణ మానవుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో స్నేహం పెంపొందించుకోవాలి. కనీసం జీవిత భాగస్వామితోనైనా సఖ్యత ఏర్పరచుకోవాలి. బంధం బలపరచుకోవాలి. అనుబంధం మొగ్గ తొడగాలి.
బంధం.. అనుబంధం పటిష్టం చేసుకోవడమంటే అదేదో తరగతి పరీక్ష కాదు.. ఏదోలా రాసిపడేయడానికి. పోతే మరోసారి రాసుకోవచ్చు అనుకోవడానికి వీల్లేని జీవితపరీక్ష. అదేదో పోటీకాదు.. ఓటమి గెలుపులను నిర్ణయించడానికి. అదొక అపురూప భావన! అవతలి వ్యక్తిని కంటికి రెప్పలా చూసుకోవాలన్న భావన. మనకంటే వెయ్యిరెట్లు జాగ్రత్తగా కాచుకోవాలన్న ఉత్కృష్ట కామన! ఇది సాధించాలంటే ఇరువురికీ కావాల్సింది ఓర్పూ నేర్పూ!
భూప్రపంచంలో ఏ యిద్దరూ ఒక్కలా ఆలోచించరు.ఆలోచించలేరు! ఇది భార్యాభర్తలకూ వర్తిస్తుంది. అది నేరం కూడా కాదు. నిజం చెప్పాలంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించాలనడం ఒకేలా చేయాలనడం సరికాదు.. తినగా తినగా గారెలు చేదన్న సామెతవుతుంది.
ఎవరి వ్యక్తిత్వాలను వారు సంరక్షించుకుంటూనే ఎదుటివారికి ఇష్టం కలిగేలా నడుచుకోవడం.. ఆ మేరకు రాజీపడడం మధురంగా ఉంటుంది.
అంతేగానీ ప్రతిదానికీ ‘నీ ఇష్టమే నా ఇష్టం’ అంటే క్రమంగా జీవితంలో యాంత్రికత, కృత్రిమత్వం చోటు చేసుకుంటుంది.
మథిస్తేనే క్షీరసాగరం నుంచి హాలాహలంతో పాటు అమృతం, కామధేనువు, కల్పవృక్షమూ ఇతరత్రా పుట్టాయి. మేధోమథనం ద్వారానే మేలు కలుగుతుంది.
ఒక్క మేధావి బుర్ర కంటే ఇద్దరు మూర్ఖుల బుర్రలు మేలనేది ఇందుకే.
ఇంటికి లేదా కుటుంబానికి సంబంధించి ఏదన్నా వస్తువు కొనాలంటే దంపతుల నడుమ చర్చ జరగడం అవసరం. అది కుటుంబ విశాల ప్రయోజనం దృష్టిలో ఉంటే ఉత్తమం. చర్చ ‘రచ్చ’ కాకుండా చూసుకోవడం భార్యాభర్తల బాధ్యత. వ్యక్తిత్వ రక్షణ పేరుతో మొండి పట్టుదలకు, అహానికి పోతే మొదటికే మోసం..
ముఖ్యమైన విషయమేమంటే- ఏ సమస్యనైనా ఎంతసేపూ మనవైపు నుంచేకాక అవతలివారివైపు నుంచి కూడా ఆలోచించడం అలవరుచుకోవాలి.
పూర్ణమానవులుగా ఎదగడానికి ఇది తొలిమెట్టు.
మనం చెప్పిన దాన్ని కాదన్నా.. మరో అభిప్రాయం వెల్లడించినా అవతలివారిని శత్రువుగా చూసే స్వభావం మార్చుకోవాలి. ఇది మలిమెట్టు.
మనం అనుకున్నది మంచి విషయమే కావచ్చు. కుటుంబానికి మేలు చేసేదే కావచ్చు, కానీ చెప్పే తీరు కటువుగా కాక ఒబ్బిడిగా చెప్పి ఒప్పించేలా ఉండాలి. ఇది మూడో మెట్టు.
గుర్తుంచుకోవల్సినవి..
వీలైనంత వరకూ ముఖంపై చిరునవ్వు ఉంచుకోండి.
తనమీద మీకు కోపం వచ్చింది.. ఆ సమయంలో నోరు తెరవకండి. మీ కోపం తగ్గాక చెప్పాలనుకున్నది మెల్లగా చెప్పండి.
మీ భాగస్వామికి మీపై కోపం వచ్చింది.ఏదేదో అంటున్నారు.. అప్పుడూ మీరు నోరు తెరవకండి. తనకోపం తగ్గాక వారేం చెప్పాలనుకున్నారో చెప్పమని అడగండి. ఎందుకిదంతా అంటే కోపం మనిషి విచక్షణా జ్ఞానాన్ని పోగొడ్తుంది. అప్పుడు నాలుకకు అవకాశమిస్తే హృదయాల్నేగాదు భూగోళాన్నే బీటలు వార్చగలుగుతుంది.
ఇంటికి వెళ్లేముందు మీ భార్యకు చిన్న బహుమతో లేదంటే ఓ పది రూపాయల పూలో తీసుకెళ్లండి. ‘ఇది నీకోసం తెచ్చాను’ అనండి. తనెంత సంతోషిస్తారో మీరే చూస్తారు.. భర్త ఇంటికి రాగానే ‘నీకిష్టమని ఈ కోవా నేనే స్వయంగా చేశాను’ అని చెప్పండి. చాలు అతనెంత ఆనందిస్తాడో మీకే తెలుస్తుంది. ఇందులో మతలబేంటంటే ఇంటా బయటా భాగస్వామికి తాము గుర్తున్నామనే విషయం ఎనలేని హాయినిస్తుంది. భద్రతనిస్తుంది. ఇలా ఆలోచించండి.. మరిన్ని మార్గాలు మీకే తోస్తాయి.

Comments

Popular posts from this blog

శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు